Yash: బిగ్ అప్డేట్ ఇచ్చిన యష్..టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. యష్ 19 టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో యష్ ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
కెజియఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయి 20 నెలలు కావొస్తున్న.. ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు యష్(yash). కెజియఫ్ జోష్‌లో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడని భావించిన యష్ అభిమానులు.. ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. యష్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. వస్తే సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తానని చెబుతు వస్తున్నాడు. ప్రస్తుతం తాను రిలాక్స్ అవడం లేదని.. ఏదైనా చేస్తున్నానంటే మీరందరూ ఇచ్చిన ధైర్యం వల్లే.. కానీ సగం వండిన ఆహారాన్ని మాత్రం వడ్డించలేను.. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. మీరంతా గర్వపడేలా సినిమా ఉండబోతుందని.. రీసెంట్గా చెప్పుకొచ్చాడు యష్.
అన్నట్టుగానే.. ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపాడు యష్. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో లోడింగ్.. అంటూ డిజైన్ చేసి ఉన్న డీపీని పోస్ట్ చేసిన యష్.. ఇప్పుడు టైటిల్ రివీల్‌కు డేట్ ఫిక్స్ చేశాడు. యష్ కెరీర్లో 19వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు రివీల్ కానుందని ముహూర్తం ఫిక్స్(fix) చేశాడు. అలాగే.. ఈ ప్రాజెక్ట్‌ను కెవిఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు.
కానీ డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. మళయాళి డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(geethu mohandas)ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హీరో, దర్శకురాలి మధ్య కథపై చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే.. షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.