కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అందుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఈ సినిమా తర్వత కాస్త గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట.
KGF Yash: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కెజియఫ్ సిరీస్ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కెజియఫ్ చాప్టర్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా లెవల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అందుకే.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. కెజియఫ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు యష్.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ సినిమాను కూడా కెజియఫ్ సిరీస్ లాగే ప్లాన్ చేస్తున్నారట. టాక్సిక్ సినిమాకు సీక్వెల్‌కు కూడా ఉంటుందని, మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర కమిట్మెంట్స్ కారణంగా కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే.. టాక్సిక్ రెండు భాగాలుగా వస్తుందో లేదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.