Hero Yash: వయస్సులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో యష్ రొమాన్స్?
కన్నడ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న యష్.. చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ ఫిక్స్ అయినట్టుగా తేలిపోయింది.
Hero Yash: కెజియఫ్ సిరీస్‌తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు యష్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయాడు. అలా అని కెజియఫ్ జోష్‌లో ఎలా పడితే అలా సినిమాలు కమిట్ అవడం లేదు. పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను కాపాకోవాలంటే.. ఆచితూచి అడుగులేయాల్సిందే. అందుకే చాలా గ్యాప్ తీసుకొని ఇటీవలె ‘టాక్సిక్’ అనే భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉంది. అయితే.. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ పేరు వినిపించింది. కానీ ఈ సినిమాపై ఏదైనా అప్డేట్ ఉంటే తామే స్వయంగా అందిస్తామని చెప్పుకొచ్చాడు యష్.
అక్కడితో హీరోయిన్ మ్యాటర్ సైలెంట్ అయిపోయింది. కానీ లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ.. తాను సౌత్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా కన్ఫర్మ్ చేసింది. దీంతో స్వయంగా కరీనా కన్ఫర్మ్ చేయడంతో.. ఆ సౌత్ ప్రాజెక్ట్ దాదాపుగా యష్ సినిమానే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. గతంలో వచ్చిన రూమర్స్‌ను బట్టి ఆ సినిమా టాక్సిక్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే.. ఈ సినిమాలో కరీనా మెయిన్ ఫీమెల్ లీడ్‌లో హీరోయిన్గా నటిస్తుందా? లేదంటే కీలక పాత్రలో కనిపించనుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ యష్‌తో కరీనా అనేసరికి ‘టాక్సిక్’ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.