SRPT: తిరుమలగిరి మండలంలోని 13 మహిళా సంఘాలకు స్త్రీ శక్తి భవనాలు, మినీ గోదాముల నిర్మాణంపై సమీక్ష సోమవారం నిర్వహించబడింది. ఎంపీడీవో లాజర్ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలతో సమన్వయం చేసుకుని భవనాల కోసం తక్షణమే భూమిని గుర్తించాలని ఆదేశించారు. స్థలాలను గుర్తించిన వెంటనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి కేటాయింపులు చేస్తారని తెలిపారు.