WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) వినియోగదారుల కోసం నిత్యం ఏదో ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. మాములుగానే వాట్సప్ నుంచి ఏదైన ఫైల్, ఫోటో, వీడియోలు పంపితే అవి క్వాలిటీ పోతాయని అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక అప్డేట్ తీసుకొచ్చింది వాట్సప్. తాజాగా HD వీడియోలను షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. గూగుల్ డాక్స్ (Google Docs) లింక్‌లు లేదా ఇతర ట్రాన్స్ఫర్ సర్వీసులకు ఇక గుడ్ బై చెప్పవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫోటో-షేరింగ్ కోసం వాట్సాప్ HD సపోర్టును అందించిన కొన్ని రోజుల తర్వాత ఈ కొత్త ఫీచర్ వస్తుంది. ప్రస్తుతం.. ఈ ఫీచర్ Android, iOS యూజర్లకు అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ ద్వారా ముందుగా షేర్ చేయాలనుకునే ఫైల్‌ను ఎంచుకోవాలి. Send బటన్‌ను నొక్కే ముందు.. టాప్ కార్నర్లో HD ఐకాన్ కోసం Tap చేయండి. మీరు డిఫాల్ట్‌గా ప్రామాణిక క్వాలిటీ నుంచి రిజల్యూషన్‌ని HDకి మార్చవచ్చు. హై రిజల్యూషన్‌లో ఫొటోలు, వీడియోలను పంపడం ద్వారా ఎక్కువ డేటా, స్టోరేజ్ అవసరం పడుతుంది. ఆసక్తికరంగా, వినియోగదారులు డౌన్లోడ్ చేయాలనుకునే HD రిజల్యూషన్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఫొటోను స్వీకరిస్తే.. స్టాండర్డ్ వెర్షన్‌ను ఉంచాలా లేదా HDకి అప్‌గ్రేడ్ చేయాలా అనేది మీరు ఫొటో-బై-ఫొటో ఆధారంగా ఎంచుకోవచ్చు. జూమ్ (Zoom), మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams), మీట్ (Meet) వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫీచర్ ఇప్పుడు సాధారణంగా అందుబాటులో ఉంది.
వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరికొన్ని ఫీచర్లను కూడా పరీక్షిస్తోంది. ఇటీవల, మెసేజింగ్ కంపెనీ త్వరలో ఒకే డివైజ్‌లో మల్టీ-అకౌంట్ సపోర్ట్‌ను రిలీజ్ చేయవచ్చని వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్ ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, (Facebook), (Instagram)లో (Meta)లో ఒకే డివైజ్‌లో మల్టీ-అకౌంట్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఆఫీసు, ఇంటికి వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ చాలా యూజ్ అవుతుందని తెలుస్తుంది.