Tilak Varma And Nehal Is The Team India Super Stars: Rohit Sharma
Rohit Sharma: తిలక్ వర్మ, నేహాల్ వధెరా సూపర్ స్టార్స్ అవుతారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అభిప్రాయపడ్డారు. వారిద్దర ముంబై ఇండియన్స్ తరఫున కాకుండా.. టీమిండియాకు స్టార్స్ అవుతారని తెలిపారు. మంచి భవిష్యత్ ఉందని వివరించారు. ముంబై జట్టు తరఫున ఆడి.. ఇప్పుడు స్టార్లుగా మారిన జస్ప్రీత్ బుమ్రా (bumra) , అక్షర్ పటేల్ (axar patel), హర్థిక్ పాండ్య (hardik pandya), కృనాల్ పాండ్యా (krunal pandya) రేంజ్లో ఉంటారని వివరించారు.
తిలక్ వర్మ (tilak varma), నేహాల్ (nehal) కూడా అంతే.. మరో రెండేళ్లలో సూపర్ స్టార్స్ అవుతారని తెలిపారు. ఇటీవల ముంబై జట్టులో తిలక్, నేహాల్ కీ రోల్ పోషిస్తున్నారు.టీ20లో యాంకర్ పాత్రకు కాలం చెల్లిందని రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నారు. టీ20 క్రికెట్ ఆడుతున్న విధానం చూస్తే యాంకర్ పాత్ర అవసరం లేదన్నారు. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే.. అవసరం ఉంటుందని చెప్పారు. ప్రతీ రోజు అలా జరగకపోవచ్చు కదా అన్నారు. ఎప్పుడో ఓ సారి అలాంటి అవసరం ఉంటుందని చెప్పారు.
టీ20 ఫార్మాట్లో చాలా రోజుల నుంచి ఆడుతున్నానని.. తాను అబ్జర్వ్ చేసి చెబుతున్నానని తెలిపారు. కాగా నిన్న లక్నోపై (lsg) ముంబై (mumbai) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్నోను చిత్తు చేసిన ముంబై.. రెండో క్వాలిఫైయర్‌కు వెళ్లింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే.. చెన్నైతో ఫైనల్ ఆడనుంది. ఈ సారి చెన్నై, ముంబై ప్రదర్శన కూడా బాగున్నాయి. గుజరాత్ కూడా అద్భుతంగా ఆడుతోంది.