»Suryakumar Yadav And Tilak Verma Were Crucial In Indias Victory Over West Indies
India vs West Indies: చెలరేగిన సూర్య..లేదంటే ఈకాస్త పరువు కూడా
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండె ఆటలు ఓడిపోయిన భారత్ మూడోది గెలిచి పరువు కాపాడింది. గత రెండు టీ20లలో రాణించిన తిలక్ వర్మతో ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జతకట్టడంతో విజయం సులువు అయింది.
Suryakumar Yadav and Tilak Verma were crucial in India's victory over West Indies
India vs West Indies: ప్రావిడెన్స్(Guyana, Providence) వేదికగా వెస్టిండీస్(West Indies) వర్సెస్ భారత్ తలపడిన పోరులో టీమ్ ఇండియా(Team India) పరువు కాపాడుకుంది. 1-2గా నిలిచి సిరీస్‌పై ఆశాలను మిగిల్చింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఆటలో భారత ఆటగాళ్లు తీరు మెచ్చకోదగ్గదిగా ఉంది. అయితే ముందు రెండు టీ20 మ్యాచ్‌లలో పొరపాట్లు చేసినా కీలక సమయంలో సత్తాచాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా..అందులో బ్రాండన్ కింగ్ (42; 5 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), మయేర్స్ (25), పూరన్ (20) స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.
తరువాత 160 లక్ష్యంగా బరిలో దిగిన భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇండియన్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 83; 10 ఫోర్లు, 4 సిక్స ర్లు) చెలరేగిపోయాడు. ఇతనికి తోడు హైదరాబాదీ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గత రెండు ఆటల్లో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన తిలక్ వర్మ అదే జోరు కొనసాగించగా.. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. వికెట్‌కు నలువైపులా షాట్లతో గ్రౌండ్లో విజృంభించాడు. సూర్య దంచికొడుతుంటే.. తిలక్ అతడికి పూర్తి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 51 బంతుల్లోనే 87 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. సూర్య ఔటైన తర్వాత తిలక్ కెప్టెన్ హార్దిక్ కలిసి జట్టును గెలిపించారు. అయితే ఇదే జోష్ మరో రెండు మ్యాచ్‌లో కొనసాగించనుంది. అందులో ఏ ఒక్క మ్యాచ్ చేజారినా ఇక కప్ వాళ్లకు ఇచ్చేసినట్లే కాబట్టి భారత ఆటగాళ్లు నిలకడగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.