»Ajay To Yogi Adityanath Book Release Children Excited To Buy
Ajay to Yogi Adityanath: ‘అజయ్ టు యోగి ఆదిత్యనాథ్’ బుక్ రిలీజ్..కొనేందుకు ఎగబడ్డ జనం
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఉన్న క్రేజ్ కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రస్తుతం సౌత్‌లో ప్రజల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అతను యూపీలో అవినీతి, అక్రమార్కుల పట్ల చేస్తున్న కృషితోపాటు విద్య, వైద్యానికి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషిని అనేక మంది ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వచ్చిన అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ పుస్తకాలను హైదరాబాద్‌లో రిలీజ్ చేయగా ఈ పుస్తకాన్ని కొనేందుకు అనేక మంది మక్కువ చూపారు.
Ajay to Yogi Adityanath book release children excited to buy
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బెస్ట్ సెల్లర్ ప్రముఖ రచయిత శంతను గుప్తా రాసిన కొత్త గ్రాఫిక్ నవల “అజయ్ టు యోగి ఆదిత్యనాథ్(Ajay to Yogi Adityanath)” పుస్తకాన్ని యువ పాఠకుల కోసం మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, రాజ్యసభ ఎంపీ జాఫర్ ఇస్లాం, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ, చిల్కూరు పూజారి బాలాజీ సీఎస్ రంగరాజన్ హాజరయ్యారు.
‘అజయ్ టు యోగి ఆదిత్యనాథ్’ పుస్తకంలో ఉత్తరాఖండ్‌లోని లోతట్టు ప్రాంతంలో ఆరుగురు తోబుట్టువులతో జన్మించిన చిన్న పిల్లవాడు అజయ్ సింగ్ బిష్త్. అతని ప్రయాణం సహా పలు విషయాలు, సీఎం ఎదుర్కొన్న పరిస్థితులను పుస్తకంలో వివరించారు. అంతేకాదు ఆవులను సంరక్షించడం, స్వాతంత్య్ర సమరయోధుల కథలు వినడం, స్కూల్ డిబేట్లలో పాల్గొనడం వంటి వాటిపై మక్కువ చూపే అజయ్ ప్రయాణాన్ని ఈ నవల వివరిస్తుంది. అజయ్ టు యోగి ఆదిత్యనాథ్’ అనేది ప్రతి విద్యార్థి(students) అనుసరించడానికి, స్ఫూర్తిగా తీసుకోవడానికి మంచి కథగా ఉపయోగపడుతుందని రచయిత తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ఎదుగుతున్న సంవత్సరాల్లో భాగమైన వివిధ వ్యక్తులతో తన సంభాషణలు తెలుసుకుని చేసిన స్ఫూర్తిదాయకమైన ఖాతాల ద్వారా ఈ కథను తాను వివరించగలనని రచయిత అన్నారు. పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి పుస్తకం చివర్లో యోగి ఆదిత్యనాథ్‌పై అనేక పజిల్స్, గేమ్‌లను రూపొందించినట్లు తెలిపారు. గతంలో శంతను గుప్తా యోగి ఆదిత్యనాథ్‌పై రెండు బెస్ట్ సెల్లింగ్ టైటిల్స్ రాశారు. ది సన్యాసి ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరప్రదేశ్‌ను మార్చిన సన్యాసి.
యోగి ఆదిత్యనాథ్ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకమని ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్(saina nehwal) అన్నారు. చిన్న పల్లెటూరి అబ్బాయి అజయ్ నుంచి సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తనకు వ్యక్తిగతంగా ఎంతో స్ఫూర్తినిచ్చారని ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ, జాఫర్ ఇస్లాం ఒక వీడియో సందేశం ద్వారా యోగి ఆదిత్యనాథ్ జీవితం జార్ఖండ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించినందున ఆయనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. పిల్లలు అపజయాలను జీవితంలో భాగంగా స్వీకరించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం చాలా మంచి విషయమని చిల్కూరు బాలాజీ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్(rangarajan) అన్నారు. ఖైరతాబాద్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించగా అందుకు సంబంధించిన #YogiBookRocksHyderabad హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాతోపాటు ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్‌లో రోజంతా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగడం విశేషం. ప్రస్తుతం ఈ బుక్ ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్ విభాగంలో దూసుకెళ్తుంది.