ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని టీమ్‌లోకి తీసుకోవడం తెలివైన నిర్ణయమని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు.
Suresh Raina says it was a smart decision to pick Rohit Sharma and Virat Kohli for the T20
Suresh Raina: ఈ ఏడాది జూన్ మొదటి వారంలో టీ20 వరల్డ్ కప్ మొదలు కాబోతుంది. ఈ టోర్నీలో 14 నెలలపాటు టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మలు(Rohit Sharma) ఆడుతున్నారు. అయితే వీరిని ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను పక్కన పెట్టి వీరిద్దరినీ సెలెక్ట్ చేయడం ఎందుకనే భావవన విశ్లేషకుల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ మాజీ ఆటగాడు సురేష్ రైనా(Suresh Raina) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడం తెలివైన నిర్ణయమన్నారు. ఈ మేరకు జియో సినిమా, స్పోర్ట్స్18తో మాట్లాడుతూ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు.
వీరిద్దరు అనుభవం ఉన్న ఆటగాళ్లు అని, వాళ్లు ఉంటే టీమ్ పటిష్ఠంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయాలు తెలిసిందే. అక్కడి పిచ్‌లు కాస్త సంక్లిష్టంగా ఉంటాయి, రోహిత్, కోహ్లీల అనుభవం అక్కడి పిచ్‌లపై ఉపయోగపడుతుందని అన్నారు. వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ చాలా బాగుందని వెల్లడించారు. రోహిత్ కెప్టెన్సీలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బావుందని ప్రస్తావించాడు. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ – యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ చేయించి విరాట్‌ని 3వ స్థానంలో ఆడించాలని సూచించాడు. ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడి ఉండే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో అనుభవజ్ఞులు అవసరమని చెప్పాడు. ఫినిషర్‌గా రింకూ సింగ్ అద్భుతంగా రాణిస్తాడని రైనా ప్రస్తావించాడు.