»Jagatguru Paramhans Acharya Compared Congress With Cancer On Rejecting Ram Mandir Invitation
Ram Mandir : కాంగ్రెస్ రహిత భారత్ కావాలి.. అది క్యాన్సర్ వ్యాధి లాంటిది.. జగద్గురు సంచలన వ్యాఖ్యలు
రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని మహానుభావులు, సాధువులు అందరూ విమర్శించారు.
Ram Mandir : రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని మహానుభావులు, సాధువులు అందరూ విమర్శించారు. ఈ క్రమంలో జగద్గురు పరమహంస ఆచార్య కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ రహిత భారతదేశం కోసం సమయం ఆసన్నమైందన్నారు. రామాలయ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై జగద్గురు పరమహంస ఆచార్య మాట్లాడుతూ.. మీరు రాకూడదనుకుంటే ఆహ్వాన పత్రికను అస్సలు తీసుకోకుండా ఉండాల్సింది.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒకటే కోరుతున్న. మీకేమైనా బుద్ధి ఉందా?.. ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసి తర్వాత రారు అంటున్నారు, ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టిందా? అంటూ కోపం తెచ్చుకున్నాడు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ రాముడు లేడని చెప్పింది… శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ వస్తే అది మనదైనా చికిత్స లేనప్పుడు తీసేయాల్సిందే… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ప్రధాని మోడీ చెప్పినట్లు కాంగ్రెస్ రహిత భారత్‌గా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. రాముడు ముస్లింల దేవుడని, ఆయన మన పూర్వీకుడని కూడా ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇండోనేషియాలో కూడా రాముడిని వారి పూర్వీకులు అంటారు. రాముడు భారతదేశానికి రాజు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన రామ్ రాజ్ గురించి నాటి నుంచి నేటి వరకు చర్చ జరుగుతోంది. రాముడు మన జాతికి గర్వకారణం.