Nithyananda: అయోధ్య రామమందిర వేడుకలకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. స్వయం ప్రకటిత దేవుడైన నిత్యానంద పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. అతను ఈ విషయాన్ని తన ట్విటర్లో పేర్కొన్నాడు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు. ఈ చారిత్రాత్మక, అసాధారణమైన సంఘటనను మిస్ చేయవద్దు. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు అధికారికంగా ఆలయ ప్రధాన దేవుడిగా ఆవాహన చేయబడుతాడు. ప్రపంచం మొత్తంపై దయ చూపేందుకు వస్తున్నాడు’’ అంటూ ట్విట్టర్ లో నిత్యానంద కామెంట్ చేశాడు. ఈ గొప్ప కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానించారని, భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం హాజరవుతారని చెప్పారు. నిత్యానందపై 2010లో అతని డ్రైవర్ ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదై, ఆ తర్వాత అరెస్టు చేశారు. అతను బెయిల్పై విడుదలయ్యాడు. 2020లో భారతదేశం నుండి పారిపోయాడు. అతను ఈక్వెడార్ దేశానికి సమీపంలోని ఒక ద్వీపంలో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాష్” పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir!
Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world!