Rohit Sharma who broke the head of a Dhoni fan in Maharashtra
IPL2024: ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిమాని భారత మాజీ కెప్టెన్ ధోని అభిమాని తల పగలగొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ నెల 27న ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆట మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు నడుమ జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఆర్హెచ్, ఎంఐ మధ్య మ్యాచ్ జరిగిన రోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కొంతమంది ఒకచోట చేరి ఆటను వీక్షిస్తున్నారు.
అందులో కొంత మంది ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు ఉన్నారు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. రోహిత్ ఔట్ అయ్యాడు ముంబై పని అయిపోయింది అని బండోపంత్ టిబిలే (63) హేళనగా మాట్లాడాడు. ఆ మాటలకు కోపం తెచ్చుకున్న రోహిత్ అభిమానులు బల్వంత్, సాగర్ టిబిలే ఇద్దరు వ్యక్తులు బండోపంత్పై దాడికి దిగారు. కర్రలతో అతడి తలపై కొట్టారు. దాంతో బండోపంత్ తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. చుట్టు ఉన్నవారు కల్పించుకొని వారిని ఆపారు. అప్పటికే రక్తపుమడుగులో పడి ఉన్న బండోపంత్ను ఆసుపత్రికి తరలించారు. బండోపంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.