Rohit Sharma టెస్టులకు రిటైర్ అయిపో.. లేదంటే క్రికెట్ నుంచి తప్పుకో, ట్విట్స్
డబ్ల్యుటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కోపం నశళానికి ఎక్కింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకో.. లేదంటే క్రికెట్ నుంచి రిటైర్ అయిపో అని ట్వీట్స్ చేస్తున్నారు.
Rohit Sharma: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో క్రికెట్ ఫ్యాన్స్ గుర్రు మీద ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో పోరాట పటిమ చూపలేదని మండిపడుతున్నారు. అందుకే ఇండియా ఓడిపోయిందని.. ఇందుకు కారణం రోహిత్ శర్మ (Rohit Sharma) అని ఫైర్ అవుతున్నారు. కెప్టెన్సీ నుంచి దిగిపో.. లేదంటే రిటైర్ అయిపో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో రోహిత్ శర్మ (Rohit Sharma) హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంది.
— 🔥🔥🔥Stylish 💖Prasanth 🔥🔥🔥 (@StylishPrasant3) June 11, 2023
రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఓడిపోయాని అంటున్నారు. ఇప్పటికీ అతనే కెప్టెన్‌గా ఉంటే వన్డే వరల్ట్ కప్ కూడా కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. #Retire #Rohitsharma హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కొందరు రిటైర్ వాడపావ్ అని పోస్టులు పెడుతున్నారు. రకరకాల మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం సిగ్గు అనిపిస్తే.. రిటైర్ అయిపో… క్రికెట్ అంటే కొంచెం అయినా గౌరవం ఉంటే రిటైర్ తీసుకో అంటున్నారు. మరికొందరు షేమ్ లెస్ షిట్ మాన్ శర్మ అని రాస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ తీసుకో.. రోహిత్ అని అంతా కోరుతున్నారు.
Lost Asia cup Lost t20 World cup And now lost WTC. Biggest Choker Vadapav
— चौधरी सुनील सोलंकी (@imsolankisunil) June 11, 2023
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఓడిపోవడం అంటే మాములు విషయం కాదు. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు పంపడం మంచి నిర్ణయమే అనుకున్నానని రోహిత్ (Rohit) అన్నాడు. ఫస్ట్ సెషన్ అలానే జరిగిందని వివరించాడు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చక్కగా ఆడి.. మ్యాచ్ స్వరూపం మార్చివేవారని తెలిపాడు. టెస్ట్ మ్యాచ్‌లో వెనకబడితే పుంచుకోవడం కష్టం అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. గట్టిగా పోరాడి.. చివరి వరకు మంచి ప్రదర్శన ఇచ్చామని రోహిత్ చెప్పాడు. డబ్ల్యూటీసీలో రెండుసార్లు ఫైనల్ చేరడం గొప్ప విషయం అని.. తమ జట్టు పోరాట పటిమ చూపిందని పేర్కొన్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకో.. లేదంటే రిటైర్ అయిపో అని కోరుతున్నారు.