Rashid Khan Has Flamboyant Innings but MI Won the Match
Rashid Khan:ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చిచ్చర పిడుగు రషీద్ ఖాన్ (Rashid Khan) రెచ్చిపోయాడు. కేవలం 32 బాల్స్‌లో 3 ఫోర్లు.. 10 సిక్సులతో ముంబై జట్టులో వణుకు తెప్పించాడు. 72 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. ఓ వైపు కాలు నొప్పి పెడుతున్న సరే.. ఇన్సింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో ముంబై గెలిచిన ఆ టీమ్‌కు కూడా కిక్ వచ్చి ఉండదు. ఎందుకంటే.. రషీద్ ఖాన్ (Rashid Khan) విధ్వంసం అలా ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (surya kumar yadav) సెంచరీతో కదం తొక్కాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ఏ దశలోనూ పోరాడినట్టు అనిపించలేదు. వరసగా వికెట్లను కోల్పోతూ.. గుజరాత్ జట్టు అభిమానులను నిరాశ పరిచింది.
గుజరాత్ జట్టులో సాహ (saha), గిల్ (gil), పాండ్యా (pandya) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. విజయ్ శంకర్ (vijaya shankar) 29 పరుగుల వద్ద ఔట్ కాగా.. మిల్లర్ (miller) 41 రన్స్ చేసి వెనుదిరిగాడు. చివరలో వచ్చిన రషీద్ ఖాన్ (Rashid Khan) మెరుపులు మెరిపించాడు. 21 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అతనికి ఇదీ తొలి అర్థ సెంచరీ.
భారీ లక్ష్యం కావడం.. స్టార్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరడంతో రషీద్ ఖాన్ (Rashid Khan) ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ గుజరాత్ జట్టు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై (mumbai) జట్టు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా.. గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 8 గెలిచి.. అగ్రస్థానంలో కొనసాగుతోంది.