ఆస్ట్రేలియా క్రికెటర్, ఆర్సీబీ(RCB) స్టార్ బ్యాట్స్ మన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell) తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఓ చిన్న బాబు డ్రెస్ తో పాటు, బేబీ స్కాన్ ని పక్కనే పెట్టి ఆ ఫోటోని వినీ రామన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ బేబీ ఈ ఏడాది సెప్టెంబర్ లో వస్తున్నాడని ఆమె ప్రకటించడం విశేషం. అలాగే… ప్రసవ సమయంలో వచ్చే ప్రసవ నొప్పులు ఎంత కలిగిస్తున్నాయో కూడా ఆమె వివరించడం గమనార్హం.
మాక్స్వెల్(Glenn Maxwell) 2022లో వివాహం చేసుకున్నారు. మొదట ఆస్ట్రేలియాలో..ఇద్దరూ క్రైస్తవ ఆచారాలతో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఇద్దరూ తమిళ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వినీ భారతీయ మహిళ కాగా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడింది. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న వీరు 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులం కాబోతున్నామంటూ శుభవార్త తెలియజేశారు. కాగా, వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో వైపు మ్యాక్స్ వెల్ ఆర్సీబీ(RCB) తరపున ఐపీఎల్ (IPL)లో ఆడుతున్నాడు. చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోయినా మ్యాక్స్ వెల్(Glenn Maxwell) ఆటకు అందరూ ఫిదా అయిపోయారు.