Kohli: కోహ్లీ శ్రమ వృథా సొంత మైదానంలో ఆర్సీబీ ఓటమి..!
ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కేకేఆర్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.
కోహ్లీ(Kohli)శ్రమ మరోసారి వృథా అయ్యింది. జట్టును గెలిపించడానికి ఆయన ఎంత కష్టడినా లక్ కలిసిరాలేదు. చివరికి సొంత మైదానంలో ఆర్సీబీ(RCB)కి ఓటమి ఎదురైంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసినా, అది వృథా అయిపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు.
విరాట్ కోహ్లీ (54 పరుగులు, 37 బంతుల్లో, 6 ఫోర్లు) ఆశలు రేపినా.. కేకేఆర్ ఆటగాళ్లు కీలక సమయంలో బౌలింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టడంతో ఆర్సీబీ(RCB)కి ఓటమి తప్పలేదు. డుప్లెసిస్ (17 పరుగులు, 7 బంతుల్లో, 1 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాక్స్వెల్ (5 పరుగులు, 4 బంతుల్లో, 1 ఫోర్) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ జట్టు కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ ఒత్తిడిలో రాణించినా.. చివరికి సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద వెంకటేశ్ ఐయ్యర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ కావడంతో ఆర్సీబీ ఓటమి ఖరారైపోయింది… ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 35 పరుగులు కావాల్సి వచ్చాయి. వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్లో 13 పరుగులే రావడంతో ఆర్సీబీ, 21 పరుగుల తేడాతో ఓడింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్(KKR), నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, 200 పరుగుల భారీ స్కోరు చేసింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జాసన్ రాయ్, ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.