T20 World Cup 2023: సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత్
నేడు మహిళల టీ20 వరల్డ్ కప్(T20 Womens world cup)లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. నేటి మ్యాచ్ టీమిండియా(Team India)కు కీలకం కానుంది. మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దీంతో భారత్(Team India) బౌలింగ్ చేపట్టింది.
నేడు మహిళల టీ20 వరల్డ్ కప్(T20 Womens world cup)లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. నేటి మ్యాచ్ టీమిండియా(Team India)కు కీలకం కానుంది. సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలవాలి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దీంతో భారత్(Team India) బౌలింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ను భారత జట్టు 150 పరుగుల లోపే కట్టడి చేస్తే టీమిండియా(Team India)కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత జట్టు(Team India) మెరుగైన బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
#TeamIndia is all set for an all important game against Australia.
ఈసారి ప్రపంచ కప్(T20 World cup)లో భారీ ఆశలతో భారత మహిళల జట్టు బరిలోకి దిగింది. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఓడిపోతూనే వస్తోంది. అందుకే ఈసారి భారత అమ్మాయిలు గట్టిగానే నిలబడ్డారు. తొలి సెమీ ఫైనల్ లో ఈ రెండు జట్ల మధ్య హోరాహొరి మ్యాచ్ జరగనుంది. గ్రూప్1లో ఆడినటువంటి నాలుగు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా గెలిచింది. అందుకే ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకుంది. గ్రూప్2 నుంచి భారత జట్టు మూడు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. లీగ్ దశలో పాక్, వెస్టిండీస్, ఐర్లాండ్ పై టీమిండియా(Team India) విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
Australia have won the toss and elect to bat first in the semi-final at the #T20WorldCup
ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ కప్ ను సొంతం చేసుకుంది. ఇప్పడు సీనియర్ స్థాయిలో తొలి కప్పును కైవశం చేసుకునేందుకు టీమిండియా(Team India) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత మూడు పర్యాయాలు టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు భారత్(Team India) చేరుకుంది. అయితే 2020లో రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో ట్రోఫీని గెలవాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్ మహిళల జట్టు(Team India) టీ20 వరల్డ్ కప్(T20 World cup) గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు.