తాజా ఐపీఎల్ (IPL) సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శన చేస్తోంది. గెలిచే మ్యాచ్ (Match)లను కూడా చేజేతులా జార విడుచుకుంటోంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో (Kolkata Knight Riders) గురువారం జరిగిన మ్యాచ్ ను కూడా అదే విధంగా సన్ రైజర్స్ ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ (SRH) యజమాని కావ్య మారన్ (Kaviya Maran) పరిస్థితి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఈ మ్యాచ్ లో ఆమె హావభావాలు (Expressions) సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సన్ రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు ఎలా స్పందించిందో.. మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో ఆమె భావోద్వేగాలు హావభావాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. ఆమెను చూసినవారంతా ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు (Netizens) కామెంట్ చేస్తున్నారు. ‘ఆమె కోసమైనా మ్యాచ్ గెలవండి’ అంటూ సన్ రైజర్స్ కు మద్దతుగా పోస్టులు, కామెంట్లు, స్టేటస్ లు పెడుతున్నారు.
ఉప్పల్ (Rajiv Gandhi International Stadium Uppal) వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తాపై 5 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. తాజా ఓటమితో ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తం 9 మ్యాచ్ లు ఆడగా.. మూడింట గెలిచింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో హైదరాబాద్ (Hyderabad) కొనసాగుతోంది. కేకేఆర్ (KKR)తో మ్యాచ్ లో నెగ్గి మెరుగైన స్థానం పొందుతుందనుకుంటున్న సమయంలో ఓడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో యజమాని కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సన్ రైజర్స్ బౌలర్లు (Bowlers) వికెట్లు పడగొట్టిన ఆనందంలో.. చేధనకు దిగిన సమయంలో సిక్స్ లు, ఫోర్లు బాదినప్పుడు పట్టరాని సంతోషంలో కావ్య మునిగింది. అదే బ్యాటింగ్ సమయంలో వికెట్లు పడిపోయిన సందర్భంలో కావ్య ఆందోళన చెందింది. ఇక మ్యాచ్ ముగిసే సమయంలో ఉత్కంఠగా మారడంతో కావ్య కూడా ఏం జరుగుతుందోమేనని ఆందోళన చెందింది. ఇక మ్యాచ్ ను చేజార్చుకున్న సమయంలో కావ్య ఏడవడం ఒకటే తక్కువ. అంతలా బాధపడిపోయింది. తెల్లగా ఉండే ఈ అమ్మడు తీవ్రంగా బాధపడడంతో ఆమె బుగ్గ చెక్కిళ్లు ఎర్రగా మారాయి. కంటి నుంచి నీరు ఉబికి వస్తున్నా అదుపులోకి పెట్టుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారాయి. కావ్య పాపపై అందరూ జాలి కనబరుస్తున్నారు.