భారత్ వేదికగా ఈ ఏడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (World cup) జరగనుంది.ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచ కప్ వీక్షించేందుకు ఆహ్వానిస్తున్నది. ఇందు కోసం ‘గోల్డెన్ టికెట్ (Golden ticket) ఫర్ ఇండియా ఐకాన్స్’ తీసుకువచ్చింది. తొలి టికెట్‌ను బాలీవుడ్ మెగాస్టార్, సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అందజేసింది. తాజాగా క్రికెట్ (Cricket) దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండుల్కర్‌కు గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ అందజేసింది. బోర్డు కార్యదర్శి జైషా సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను కలిసి గోల్డెన్ టికెట్‌ను అందజేసి, ప్రపంచకప్‌ను వీక్షించేందుకు రావాలని ఆహ్వానించారు.మరి కొన్ని రోజుల్లో భారత్ లో ఐసీసీ (ICC) క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది.
అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఈ మెగా ఈవెంట్ (Event)కు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతున్నందున బీసీసీఐ (BCCI) గోల్డెన్ టికెట్ పేరిట దేశంలోని వివిధ రంగాల దిగ్గజాలకు వీఐపీ పాస్ లు అందజేస్తోంది.ఈ గోల్డెన్ టికెట్ తో వరల్డ్ కప్ లోని ఏ మ్యాచ్ ను అయినా, స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించవచ్చు.క్రికెట్ నైపుణ్యానికి సచిన్ ప్రతీక అని, దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా బీసీసీఐ కొనియాడింది. సచిన్ క్రికెట్ ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంది. ఇప్పుడు గోల్డెన్ టికెట్ ద్వారా సచిన్ టెండూల్కర్ కూడా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగమయ్యాడని బీసీసీఐ వివరించింది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కు కూడా బీసీసీఐ గోల్డెన్ టికెట్ అందజేసింది.