బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్ (13*), రిషభ్ పంత్ (0*) ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో యశస్వి (4), గిల్ (1), విరాట్ కోహ్లీ (3) పరుగులతో నిరాశపరిచారు.