గబ్బా టెస్టులో భారత్కు ఫాలోఆన్ గండం తప్పింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ 246 పరుగులు చేయడంతో ఫాలోఆన్ నుండి తప్పించుకుంది. అయితే బ్యాడ్ లైట్ కారణంగా నాలుగో రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. భారత్ స్కోరు 252/9. క్రీజులో బుమ్రా(10*), ఆకాశ్ దీప్(27*) ఉన్నారు. కాగా, టీమిండియా 193 పరుగుల వెనుకంజలో ఉంది.