Cricket In Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్ చూడాలనుకున్నవారి కల నెరవేరబోతుంది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కానుంది. 1900లో పారిస్ ఒలింపిక్స్‌లో ఒకసారి క్రికెట్‌ను ఆడారు. మళ్లీ 2028 ఒలింపిక్స్‌లో ఆడనున్నారు. అంటే దాదాపు 128ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఈ గేమ్ కనిపించనుంది. వీటితో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను కూడా చేర్చుతున్నట్లు సమాచారం. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయడం వల్ల దక్షిణాసియా ప్రేక్షకులను కూడా ఆకర్షించవచ్చని కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో మాదిరిగా టీ20 ఫార్మాట్లో ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ కూడా చేరింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల క్రికెట్ కూడా భాగం అయ్యింది.
A massive step for cricket and its bid for inclusion at the 2028 Olympic Games.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే నిర్ణయాన్ని ఎల్ఏ28 కమిటీ తీసుకుంది. దీనిని ఆమోదించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)కి సిఫారసు చేసింది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ముంబైలో జరగనున్న ఐఓసీ సమావేశంలో దీని గురించి తెలియజేయవచ్చు. గత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపిక్స్‌లోని 28 స్పోర్ట్స్ జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. ఈసారి చోటు దక్కడంతో క్రికెట్ అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మెన్, ఉమెన్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో టీ20 ఫార్మెట్లలో నిర్వహిస్తారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఒకసారి మాత్రమే క్రికెట్ ఆడారు. ఇందులో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో స్వర్ణ పతాకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్ టీమ్ రజతం దక్కింది. రెండు టీమ్‌లు మాత్రమే పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకపోయింది.