ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు ప్రభుత్వ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ స్వాగతం పలికింది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ 14వ మ్యాచ్‌లో చైనాకు చెందిన డింగ్ లారెన్‌ను ఓడించి గుకేశ్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు తెలుపగా.. తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించింది.