Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. సర్జరీ చేయించుకోనున్న మరో ప్లేయర్
టీమిండియా(Team India) ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. గత టీ20(T20) సమయంలో దీపక్ చాహర్(Deepak Chahar) గాయం కారణంగా ఐపిఎల్(IPL)కు దూరం అయ్యాడు. ఆసియా కప్(Asia cup) సమయంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా గాయాలపాలవ్వడంతో ఆసియా కప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు బుమ్రా(Bumrah) కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నాడు. టీమిండియా పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు గతంలో గాయం అయిన సంగతి తెలిసిందే. బుమ్రా గాయంపై బీసీసీఐ(BCCI) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

వన్డే వరల్డ్ కప్(ODI World Cup) రాబోతున్న తరుణంలో బుమ్రా(Bumrah)ను అక్టోబర్ లోపు సిద్ధం చేసేందుకు బీసీసీఐ(BCCI) ప్రయత్నాలు చేస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ నొప్పి మరింత ఎక్కువవ్వడంతో బుమ్రాకు కచ్చితంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో బుమ్రా(Bumrah)కు సర్జరీ చేయించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) వైద్యుల సలహా మేరకు బుమ్రా(Bumrah)కు బీసీసీఐ(BCCI) సర్జరీ చేయించనుంది. ఇందుకోసం బుమ్రాను కివీస్‌కు పంపనుంది. న్యూజిలాండ్ లో ఇది వరకూ కివీస్ క్రికెటర్ అయిన షేన్ బాండ్ కు, ఇంగ్లాండ్ పేసర్ అయిన జోఫ్రా ఆర్చర్ లకు సర్జరీ నిర్వహించారు. ఇప్పుడు ఆ వైద్యుడి చెంతకే బుమ్రా(Bumrah)ను పంపి బీసీసీఐ ఆపరేషన్ చేయించనుంది.
చాలా మంది క్రీడాకారులకు సర్జరీలు నిర్వహించి విజయవంతం అయిన ఘనత రోవన్ షౌటెన్ కు ఉంది. అందుకే బుమ్రా(Bumrah)ను న్యూజిలాండ్ కు పంపి అక్కడే సర్జరీ చేయించనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బుమ్రాకు సర్జరీ చేసినా కనీసం 24 వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ఉంది. ఈ నేపథ్యంలో అతడిని సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐ(BCCI) ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.