హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో జింబాబ్వే మీద ఆఫ్గనిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బింజాబ్వే 19.5 ఓవర్లో 127 పరుగులు చేసి ఆలౌటైంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్థాన్.. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34), మమ్మద్ నబీ(24*) మెరుగైన ఆట తీరును కనబరిచారు.