సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో భారత ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయం ద్వారా అతడికి రూ.11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఇందులో భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్లను పన్నురూపంలో చెల్లించనున్నాడు. అయితే ఇది ఐపీఎల్లో CSK ఆటగాడు ధోనీ శాలరీ (రూ.4 కోట్లు) కంటే ఎక్కువ అని నెట్టింట్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.