»Australia Won The Toss In The Second T20 Match India Is Batting
IND vs AUS: ఇండియా బ్యాటింగ్ అదుర్స్
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరుగుతోంది.
Australia won the toss in the second T20 match India is batting
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా(IND vs AUS) జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదిక రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగింది. ఆసీస్ జట్టులో రెండు మార్పులు చేశారు. పేసర్ బెహ్రెండార్ఫ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి తెచ్చుకున్నారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) చక్కని ఆరంభం చేశారు. జైస్వాల్ 25 బంతుల్లో 53 పరుగులు చేసి ఆడమ్ జంపా వేసిన బంతికిి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం గ్రీజులో రుతురాజ్ గైక్వాడ్(27), ఇషాన్ కిషన్(8) నాటౌట్‌గా ఆడుతున్నారు.