కృష్ణా: నందివాడలో నేహరాలి వంతెన ఆదివారం ఉదయం కూలిపోయింది. పలుమార్లు మరమ్మతులు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన నందివాడ మండల కార్యాలయాలకు వెళ్లే మార్గంలో ఉండటంతో అధికారులు, ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు.