SRCL: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్సైగా అనిల్ ఆదివారం విధుల్లో చేరారు ఎస్సైల బదిలీలో భాగంగా ఎస్సై అనిల్.. వేములవాడ నుంచి గంభీరావుపేటకు బదిలీ చేస్తూ ఎస్పీ మహేష్ బి గితే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అనిల్ ఆదివారం విధుల్లో చేరారు. నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.