PPM: ఎరువులు దుకాణాల అమ్మకాల్లో వ్యత్యాసాలు, ఉన్నట్లయితే ఆ దుకాణదారులపై చట్ట పరమైన చర్యలు తప్పని విజిలెన్స్ సీఐ రవి ప్రకాష్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రమైన పాచిపెంటలో ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.