MBNR: పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తమ అంతిమ లక్ష్యమని మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ ఫస్ట్ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇస్తున్న ప్రాక్టికల్ ప్రోగ్రాం వీక్షించారు.