GNTR: తాడేపల్లి పరిధిలోని ఆంధ్ర ఎత్తిపోతల పథకానికి మంత్రి లోకేశ్ చొరవతో పునర్జీవం లభించింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరిన మోటార్లను లోకేశ్ తన సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ పథకం ద్వారా కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, నూతక్కి, రామచంద్రపురం గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందనుంది.