ATP: ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలికిపురం, లక్కవరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజోలు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎమ్మెల్యే దారుణంగా దూషించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.