JGTL: జగిత్యాలలో గణేష నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పట్టణానికి చెందిన 27 మందిని అర్బన్ తహాసీల్దార్ రామ్మోహన్ ముందు బైండోవర్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇందులో 10 మంది డీజే నిర్వాహకులు, 10 మంది సమస్యలు సృష్టించేవారు ఉన్నారన్నారు. ఏడుగురు రౌడీషీటర్లను తహసీల్దార్ ఎదుట హాజరుపర్చామని, నిబంధనలు అతిక్రమించి చర్యలు తప్పవని హెచ్చరించారు.