ప్రకాశం: జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ దామోదర్ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని తెలిపారు.