TG: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళులు అర్పించనున్నారు. ఇందుకోసం ఉదయం సీపీఐ కార్యాలయానికి సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి ఈరోజు నివాళులర్పించనున్నారు. కాగా, గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న సురవరం తుదిశ్వాస విడిచారు.