KRNL: మంత్రాలయం మండలం బుదూరు గ్రామానికి చెందిన మీనిగి రవి (చార్లెస్) మొదటి ప్రయత్నంలోనే 83.34 మార్కులతో టీచర్ (SGT) ఉద్యోగం సాధించారు. తన కొడుకు మంచి చదువులు చదివి, గురువుగా మారాలని ఆయన తల్లి కలలు కన్నారు. ఆ కలను రవి నిజం చేశారు. తల్లి అనేక కష్టాలెదుర్కొని రవిని చదివించిందని స్థానికులు చెబుతున్నారు.