SDPT: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను వాడాలని గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ గత 21 ఏళ్లుగా చేస్తున్న ప్రచారం అభినందనీయమని MLC వంటేరు యాదవరెడ్డి తెలిపారు. ఈ సంస్థకు చెందిన మట్టి గణపతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పీవోపీతో చేసిన విగ్రహాల వల్ల జలచరాలకు, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని తెలిపారు.