KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వీరజవాన్ కొడవటికంటి రాజేష్‌కు గుర్తుగా, వారికి నిజమైన గౌరవాన్ని గ్రామస్తులు, మండల రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు చాటుకున్నారు. పాపిరెడ్డిపల్లె గ్రామం మెయిన్ బజార్‌కు అమర వీరుడు కొడవటికంటి రాజేష్ ఐ.టి.బి.పి-ఫోర్స్ వారి వీధిగా నామకరణం చేస్తూ బోర్డు ఏర్పాటు చేశారు.