KNR: SRR కళాశాలలో జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్ హాజరై మాట్లాడుతూ.. విలువలతో కూడిన పాత్రికేయులుగా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, తెలుగు విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.