కృష్ణ: కృష్ణా నది వరద ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDM A) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరించినట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరద పూర్తిస్థాయిలో తగ్గేవరకు నదీ పరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.