తిరుపతిలో ఓ జంట ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో చోటు చేసుకుంది. మృతులుగా కర్ణాటక రాష్ట్రం చామరాజ్ నగర్‌కు చెందిన వెంకటరాజు, అనూషగా గుర్తించారు. వీరు ఇటీవల ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి వచ్చినట్టు తెలుస్తోంది. మృతదేహాలను గుర్తించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.