టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ తేలిపోయాడు. ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయ్యే తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అలాగే, 2024లో అత్యల్ప బ్యాటింగ్ సగటును సైతం నమోదు చేసుకున్నాడు. టీ20ల్లో 18.00, వన్డేల్లో 19.33, టెస్టుల్లో 25.06 సగటుతో బ్యాటింగ్ చేశాడు. దీంతో 2024ను కోహ్లీ మర్చిపోడంటూ కొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇకనైనా రాణించాలని కోరుతున్నారు.