ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 658 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. కివీస్ బౌలర్ల ధాటికి తెలిపోయింది. దీంతో 234 పరుగులకే ఆలౌట్ అయింది. జాకబ్ బెల్(76), జో రూట్(54) పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్ సౌథీ తన చివరి టెస్టు మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టాడు. కాగా, మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది.