బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌కు నేడు వర్షం ఆటకం కలిగించింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 51/4 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*) క్రీజులో ఉన్నారు. యశస్వి 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. భారత్.. ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌటైంది.