భారత అభిమానులకు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్, మహిళా కామెంటేటర్ ఇసా గుహ క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గుహ.. బుమ్రాను ప్రశంసిస్తూ నోరు జారింది. కోతి జాతికి చెందిన జంతువుతో బుమ్రాను పోల్చింది. దీంతో ఆమెపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆమె.. బుమ్రాకు క్షమాపణలు చెప్పింది.