బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 51/4 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) మరోసారి నిరాశపరిచాడు. KL రాహుల్ (84) పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి భారత్ స్కోరు 167/6. క్రీజులో జడేజా(41*), నితీశ్ కుమార్ (7*) ఉన్నారు. కాగా, టీమిండియా 278 పరుగుల వెనుకంజలో ఉంది.