పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 11 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 సందర్భంగా బాబర్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. కాగా, 11 వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ కేవలం 298 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.