వర్షం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ ఆగిపోయింది. భారీగా వర్షం పడుతుండడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మ్యాచ్ను ఆపే సమయానికి భారత్ స్కోరు 180/6. క్రీజ్లో రవీంద్ర జడేజా (62*), నితీశ్ రెడ్డి (9*) ఉన్నారు. ఇంకా 265 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 66 పరుగులు చేయాల్సి ఉంది.