ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌పై కోహ్లీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. కమిన్స్, హెడ్, స్మిత్, మాక్స్వెల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడిగిన ప్రశ్నకు.. సూపర్ స్టార్, క్లాసీ, లెజెండ్ అంటూ మిగతా ప్లేయర్లు తెలిపారు. కానీ, కమిన్స్ మాత్రం ‘బ్యాటర్’ అని పేర్కొన్నాడు. దీంతో కోహ్లీని గొప్ప క్రికెటర్‌గా అభినందించడం కమిన్స్‌కు తెలియదంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.